భారతదేశం, మే 11 -- బెంగాల్ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి ఇతర పార్టీల మద్దతు కోసం పాకులాడుతోంది. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడమే లక్ష్యంగా విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావాలని మమతా బెనర్జీ శనివారం ప్రతిపాదన చేశారు. అయితే, ఆమె ఆశలపై కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ (లిబరేషన్) పార్టీలు ఆదివారం నీళ్లు చల్లాయి. అవినీతి, దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టీఎంసీతో కలిసేది లేదని తేల్చి చెప్పాయి.
మమత ప్రతిపాదనను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం తీవ్రంగా ఖండించారు. "నేరగాళ్లు, వసూల్‌రాజాలు, అవినీతిపరులు, మతోన్మాదులతో సంబంధం ఉన్న ఎవరినీ మేము అంగీకరించే ప్రసక్తే లేదు. మేము ఎప్పుడూ సామాన్య ప్రజలు, అట్టడుగు వర్గాల పక్షానే నిలబడతాం" అని మహ్మద్ సలీం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.