భారతదేశం, జూన్ 3 -- న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో బుధవారం నాడు ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాలవీయ నగర్ పరిధిలోని హౌజ్ రాణి ప్రాంతంలో ఉన్న 'ఫ్లోరిష్ స్టే' (Flourish Stay) అనే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (B&B) హోటల్‌లో భారీగా మంటలు చెలరేగడంతో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో దిల్లీలో జరిగిన అత్యంత భయంకరమైన అగ్నిప్రమాదాలలో ఇది ఒకటిగా నిలిచింది.

అయితే, ఈ ప్రమాదం జరిగిన హోటల్ యాజమాన్యం నిబంధనలను బేఖాతరు చేస్తూ.. అనుమతించిన సామర్థ్యానికి మించి హోటల్‌ను నడుపుతున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ (MCD) వర్గాలు తెలిపాయి. దిల్లీ పర్యాటక శాఖ (Delhi Tourism) ఈ భవనానికి కేవలం 6 గదులు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ, సదరు యాజమాన్యం అక్కడ ఏకంగా 24 గదులను ఏర్పాటు చేసి న...