భారతదేశం, సెప్టెంబర్ 22 -- తెలంగాణ రాజకీయంలో ఎమ్మెల్యేల అనర్హత అంశం తీవ్ర కలకలం రేపుతోంది. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దానం నాగేందర్ సోమవారం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అనర్హతపై స్పందిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ ప్రస్తావనకు వచ్చింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ... ఈ వ్యవహారంలో అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి...