Telangana,hyderabad, సెప్టెంబర్ 19 -- తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులపై ఇప్పటికే ప్రకటనలు వచ్చేశాయి. దీంతో చాలా మంది సెలవుల్లో ట్రిప్స్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం ఓ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ టూరిజం ప్లాన్ చేసింది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ట్రిప్ 24 సెప్టెంబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'SAI SANNIDHI EX HYDERABAD' పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంద...