భారతదేశం, అక్టోబర్ 17 -- దసరా పండుగ సెలవులు, వారాంతం (వీకెండ్) ఒకేసారి రావడంతో హైదరాబాద్ నగరం నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో రహదారులు కిక్కిరిసిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని జాతీయ రహదారి 65 (హైదరాబాద్ - విజయవాడ)పై వాహనాల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ వైపు నుంచి విజయవాడ వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలు నెమ్మదించడంతో ప్రయాణికులు.. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఈ భారీ ట్రాఫిక్ జామ్‌కు కేవలం వాహనాల సంఖ్య పెరగడమే కాకుండా, టోల్‌ప్లాజా వద్ద ఎదురవుతున్న సాంకేతిక లోపాలు కూడా ప్రధాన కారణమయ్యాయి. అనేక వాహనాల్లో ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేకపోవడం, కొన్ని చోట్ల ఫాస్టాగ్ స్కేనర్లు సరిగ్గా పనిచేయక సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టోల్ గేట్ల ...