దశాబ్ధాల 'విశాఖ ఎయిర్పోర్ట్' సేవల ప్రస్థానం ముగింపు - ఇక భోగాపురం నుంచే ప్రయాణాలు!
భారతదేశం, ఆగస్టు 17 -- ఆంధ్రప్రదేశ్ పర్యాటక, పారిశ్రామిక రాజధాని విశాఖపట్నం వైమానిక రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ముగిసి.. మరో నూతన అధ్యాయం ప్రారంభమైంది. భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ (ఐఎన్ఎస్ డేగా) నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీసులను అధికారికంగా నిలిపివేశారు.
ఆదివారం రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో 6E 2018 విమానమే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నడిచిన చివరి షెడ్యూల్డ్ వాణిజ్య సర్వీస్ గా రికార్డుల్లోకి ఎక్కింది.
ఈ సందర్భంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్. పురుషోత్తమ్ మాట్లాడుతూ.. "దశాబ్దాలుగా విశాఖ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు సేవలు అందించి, నగర అభివృద్ధిలో భాగమైంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన ఉద్యోగులు, భాగస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.