భారతదేశం, మార్చి 22 -- ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి తమిళనాడుకు చెందిన చేపల వేట పడవలు చొరబడటం, అక్రమంగా చేపలు పట్టడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తమిళనాడు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్.. ఏపీ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడు మత్స్య పడవలు మరింతగా ప్రవేశించకుండా నిరోధించడానికి తక్షణ జోక్యం, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తమిళనాడు మత్స్య మరియు మత్స్యకారుల సంక్షేమ డైరెక్టర్‌కు ఒక లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడుకు చెందిన యంత్ర చేపల పడవల అనధికారిక ప్రవేశం నిరాటంకంగా కొనసాగుతోందని, ఇది స్థానిక మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా ఉందని ఏపీ లేఖలో పేర్కొంది. రాష్ట్రాల మధ్య అమలులో ఉన్న నియంత్రణ వ్యవస్థను కూడా ఇలా రావడం బలహీనపరుస్తోంద...