భారతదేశం, ఆగస్టు 21 -- తెలుగు రాష్ట్రాల పరిధిలోని రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ వేగవంతమైంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో రూ. 24,210.179 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 1,481 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే లైన్లు, ట్రాక్‌ల డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో జరిగిన కీలక సమావేశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు 15 మంది ఎంపీలు హాజరైన ఈ సమీక్షలో ప్రయాణికుల సేవలు, సరుకు రవాణా, స్టేషన్లలో సదుపాయాలు, పరిశుభ్రతపై విస్తృతంగా చర్చించారు.

"రూ. 24,210.179 కోట్ల అంచనా వ్యయంతో 1,481 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి" అని దక్షిణ మధ్య రైల్వ...