దంతేవాడలో బోధ్ఘాట్ ప్రాజెక్ట్ సర్వే షురూ.. ఆదివాసీల్లో మొదలైన వలస భయం
భారతదేశం, మే 28 -- బస్తర్ ప్రాంతంలోని ఇంద్రావతి నదిపై ప్రతిపాదించిన ఈ బోధ్ఘాట్ ప్రాజెక్టు కథ నిన్న మొన్నటిది కాదు. 1979లో తొలిసారిగా ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. 1984లో ప్రపంచ బ్యాంక్ రుణానికి ఆమోదం తెలిపినప్పటికీ, అటవీ నష్టం, నిర్వాసితుల నిరసనల కారణంగా 1987లో ఇది నిలిచిపోయింది. తాజాగా నక్సలిజం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై మళ్లీ దృష్టి సారించింది.
ప్రస్తుతం సర్వే పనులకు ఆదేశాలు జారీ అయ్యాయని దంతేవాడ జిల్లా కలెక్టర్ దేవేష్ ధ్రువ్ ధృవీకరించారు. "వచ్చే ఏడు నుంచి ఎనిమిది నెలల్లో సర్వే పూర్తి చేయడమే మా లక్ష్యం. సంబంధిత సంస్థల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. సుమారు రూ. 30,000 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 2027 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.