భారతదేశం, ఆగస్టు 7 -- హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత వాహన సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే నూతన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీని అమలులోకి తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణా వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం ఈ విధానం ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ఈ నూతన విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఇదివరకే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రతినిధులు క్యాబ్ డ్రైవర్ల సంఘాలు, అగ్రిగేటర్ సంస్థల యాజమాన్యాలు, ప్రయాణికుల హక్కుల నిపుణులతో సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ నివేదికను కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. నివేదిక అందగానే నూతన నిబం...