తెలుగు వెండితెరపై సోనియా గాంధీ బయోపిక్ - జగ్గారెడ్డి ప్రకటన! డబ్బులు రెడీ చేసుకోవాలంటూ నేతలకు పిలుపు
భారతదేశం, నవంబర్ 12 -- కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత విశేషాలు, రాజకీయ ప్రస్థానాన్ని తెలుగు వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) ఆధారంగా తెలుగులో పూర్తిస్థాయి చలనచిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం ప్రకటించారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించిన నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు, సినిమా నిర్మాణం కోసం తక్షణమే రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.