భారతదేశం, జూలై 2 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు అరెస్టుల పర్వానికి దారితీసింది. రాజకీయాలపై విమర్శలు, కామెంట్లు చేసే ప్రముఖ యూట్యూబర్లు 'ప్రశ్న' ఛానల్ నిర్వాహకుడు రావణ్, అలాగే జర్నలిస్ట్ కె. వెంకటరామిరెడ్డి (కేవీఆర్)లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న వీరిద్దరినీ జూన్ 30 రాత్రి ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వీరిపై కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పోలీస్ స్టేషన్‌లో జూన్ 29న 'ప్రశ్న రావణ్'పై కేస...