భారతదేశం, జూన్ 15 -- తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. కాజీపేట - కొండపల్లి సెక్షన్‌లోని డోర్నకల్ - గుండ్రాతిమడుగు స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల నిమిత్తం నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పనుల కారణంగా ఆగస్టు 2026 నెలలో పలు రూట్లలో నడిచే రైళ్లను డైవర్ట్ చేయడంతో పాటు, మరికొన్ని రైళ్ల సమయాలను రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

విశాఖపట్నం - LTT ముంబై (18519/18520): ఆగస్టు 14 నుండి 18 వరకు ఈ రైళ్లు విజయవాడ, గుంటూరు మీదుగా డైవర్ట్ అయ్యాయి. దీనివల్ల కాజీపేట స్టేషన్‌లో వీటికి స్టాపింగ్ ఉండదు.

సీఎస్టీ ముంబై - భువనేశ్వర్ (11019/11020): ఆగస్టు 17, 18 తేదీల్లో నడిచే ఈ రైళ్లను డైవర్ట్ చేశారు. విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్...