తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ - ద్రోణి ప్రభావంతో 3 రోజులపాటు వర్షాలు! తాజా అంచనాలివే
భారతదేశం, నవంబర్ 23 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు గాలుల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్, యానాం పరిసరాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం కనిపించనుంది.
రాయలసీమలో చూస్తే. సోమవారం (నవంబర్ 23) ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు సంభవించడంతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ., గరిష్టంగా 50 కి.మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.