భారతదేశం, జూలై 10 -- తెలంగాణలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం వర్సిటీ అధికారులు కీలక ప్రకటన చేశారు.

విశ్వవిద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రవేశ పరీక్షలన్నీ జులై 23న ఒకే రోజు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని మెయిన్ వర్సిటీ ప్రాంగణంలోనే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం వేర్వేరు కోర్సులకు వేర్వేరు సమయాల్లో ప్రవేశ పరీక్షలను షెడ్యూల్ చేశారు.

ఉదయం సెషన్ (11:00 AM నుండి 12:00 PM) బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ - డ్యాన్స్, ఎం.పి.ఏ - ఫోక్ ఆర్ట్స్ కోర్సులకు పరీక్ష జరుగుతుంది....