భారతదేశం, ఆగస్టు 29 -- తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి శుభవార్త అందించింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ఆ రద్దీని నియంత్రించేందుకు మరియు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు గుంటూరు - వికారాబాద్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో పలు కీలకమైన స్టేషన్లలో ఆగుతాయి. ఆ వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి..

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని వర్గాల వారికి తగినట్లుగా సీటింగ్ వసతి కల్పించారు. వీటిలో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్ (Sleeper Class) మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుగానే రిజర్వేష...