భారతదేశం, అక్టోబర్ 5 -- తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ (TS HOUSEFED) నూతన ఛైర్మన్‌గా ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా బ్రహ్మాండబేరి గోపరాజు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన TS HOUSEFED డైరెక్టర్ల ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు.. సోమవారం సమావేశమై ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎన్నుకున్నారు. డైరెక్టర్లు పట్లోళ్ల శంకర్ రెడ్డి, పామర్తి అంకినేడు ప్రసాద్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ ముదిగంటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు TS HOUSEFEDను మరింత అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

'ప్రస్తుతం ఫెడరేషన్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు సమకూర్చ...