భారతదేశం, జూలై 4 -- రాష్ట్రంలో భద్రతా ముఖచిత్రాన్ని మార్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హోంశాఖలో సుదీర్ఘకాలంగా ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఖాళీగా ఉన్న 7,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. భద్రతా రంగంలో సిబ్బంది కొరతను తీర్చడంతో పాటు పాలనా దక్షతను పెంచేందుకు ఈ నియామకాలు దోహదం చేయనున్నాయి. శాఖాపరమైన అవసరాలు, ఆర్థిక వనరులను క్షుణ్ణంగా బేరీజు వేసిన అనంతరం ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయానికి ఆమోదం ముద్ర వేశారు.

ఈ నియామకాల్లో పెద్ద పీట వేస్తూ 5,000 పోస్టులను పోలీస్ విభాగానికే కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం. 78 (GO MS No. 78) జారీ చేస్తూ కానిస్టేబుల్ స్థాయి నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) వరకు ఖాళీలను గుర్తించింది.

మిగిలిన 2,000 పోస్టులను అనుబంధ విభాగాలైన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), జైళ్ల శాఖ, అగ్నిమాపక ...