తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని చిలుకూరు ఆలయం వరుణ జపం
భారతదేశం, జూలై 20 -- తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు పండాలని, ఎండిపోతున్న నదులు, జలాశయాలు జలకళతో నిండాలని కోరుతూ ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవస్థానం ఆధ్వర్యంలో సాంప్రదాయ 'వరుణ జపం' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూలై 21, మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి 11:00 గంటల వరకు హైదరాబాద్ శివార్లలోని గండిపేట జలాశయంలో ఈ విశేష పూజా కార్యక్రమం జరగనుంది.
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సి.ఎస్. లక్ష్మీ నరసింహన్ నాయకత్వంలో వేద పండితులు, అర్చకులు గండిపేట చెరువులో నడుములోతు నీటిలో నిలబడి ఈ పవిత్రమైన వరుణ జపాన్ని నిర్వహించనున్నారు. వేదభవన్‌కు చెందిన డాక్టర్ వి. శ్రీరామ ఘనపాటి నేతృత్వంలో పండితులు వేదాల్లోని తైత్తిరీయ సంహిత నుంచి వరుణ జప మంత్రాలను పఠిస్తారు. చిలుకూరు బాలాజీ స్వామి వారి అనుగ్రహంతో వరుణ దేవుడు, ఇంద్ర భగవానుడు శాంతించి వర్షాలు కు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.