భారతదేశం, సెప్టెంబర్ 27 -- తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలుపడనున్నాయి. ఉరుములు, మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

తాజా బులెటిన్ లోని వివరాల ప్రకారం. సెప్టెంబర్ 28 ఉదయం 08:30 వరకు చూస్తే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.

సెప్టెంబర్ 28 ఉదయం 08:30 నుండి సెప్టెంబర్ 29 ఉదయం 08:30 వరకు చూస్తే. గాలుల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్, వనపర...