భారతదేశం, జూన్ 10 -- తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీల భర్తీ ప్రక్రియపై కీలక అప్డేట్ వచ్చింది. వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

గత నెలలో ఒక పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున (1:3 నిష్పత్తిలో) అధికారులు ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ జాబితా ఆధారంగా మే 22, 23 తేదీలలో అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ (ధృవీకరణ పత్రాల పరిశీలన) నిర్వహించారు. ఎలాంటి అభ్యంతరాలూ లేని పారదర్శక ప్రక్రియ అనంతరం తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన వారి ఫైనల్ లిస్ట్‌ను బోర్డు ఖరారు చేసింది. ...