భారతదేశం, ఫిబ్రవరి 13 -- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరగగా. ఇప్పటికే 90 స్థానాల్లో హస్తం పార్టీ పాగా వేసింది. ఇందులో కీలకమైన మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష బీఆర్ఎస్12 మున్సిపాలిటీలకే పరిమితమైంది.

రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇక్కడ అటుఇటు సమీకరణాలు మారే అవకాశం ఉంది. వీటిల్లో కొన్ని కాంగ్రెస్, మరికొన్ని బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఒకే మున్సిపాలిటీకి బీజేపీ పరిమితమైంది. నారాయణపేటలో మాత్రమే ఎక్కువ వార్డులను గెలుచుకుంది. భైంసాలో అత్యధికఎంఐఎం వార్డులను కైవసం చేసుకుంది.

ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, ఇంద్రేశం, గుమ్మడిదలలో వికర్టీ కొట్టింది....