తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా స్కీమ్ ప్రారంభం
భారతదేశం, నవంబర్ 19 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటన చేశారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా విద్య, విద్యుత్, రెవెన్యూ రంగాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ రూ. 544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ. 451.13 కోట్లతో చేపట్టనున్న నూతన పనులకు శంకుస్థాపన చేయగా, ఇప్పటికే పూర్తయిన రూ. 92.98 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
అనంతరం సిద్దిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. కోటికి పైగా పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూపొందించిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' దరఖాస్తుల నమోదు ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి మెుదలుపెట్టారు. ఈ పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి రూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.