తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
భారతదేశం, నవంబర్ 23 -- తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ రాజేంద్రనగర్లోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం(PVNRTVU) పరిధిలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 117 బ్యాక్లాగ్ అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశ్వవిద్యాలయ విజ్ఞప్తి మేరకు పశుసంవర్ధక, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు వర్సిటీకి అధికారికంగా లేఖ పంపారు.
పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలు, పరిశోధనా కేంద్రాల్లో అధ్యాపకుల కొరత ఉంది. వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్ల కింద 117 బ్యాక్లాగ్ పోస్టులు దీర్ఘకాలికంగా భర్తీ కాకుండా మిగిలిపోయాయి. వీటికి తోడు గత రెండేళ్లలో పదవీ విరమణలు, ఇతర కారణాల వల్ల మరో 108 రెగ్యులర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇలా మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.