తెలంగాణ నీటి ప్రయోజనాలు బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది : మంత్రి ఉత్తమ్
భారతదేశం, ఆగస్టు 5 -- గత 12 ఏళ్లుగా ప్రతి బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించడం పరిపాటిగా మారిందని, అందులో కొత్తదనమేమీ లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతు పలికిన బీఆర్ఎస్ నాయకులు, అధికారం కోల్పోయాక ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను కాపాడే విషయంలో తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడదని తేల్చి చెప్పారు.
తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నీటి ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరిగాయని, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుల విస్తరణకు పునాదులు పడ్డాయని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.