భారతదేశం, సెప్టెంబర్ 5 -- కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో భారీ 'యువ సమరభేరి' బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయడం ఏంటి..? 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా నిరుద్యోగులను, ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి" అని డిమాండ్ చేశారు.

"2006లో కూడా ఇదే కరీంనగర్ గడ్డపై కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. అప్పట్లో కేసీఆర్ ...