భారతదేశం, జూలై 2 -- Telangana Tourism Package 2026 : రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పర్యాటక ప్రాంతాలను ఒకే రోజులో సందర్శించాలనుకునే భక్తులు, పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ఒక అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

"వన్-డే పిల్‌గ్రిమేజ్ అండ్ హెరిటేజ్ టూర్" పేరుతో ప్రవేశపెట్టిన ఈ సరికొత్త ప్యాకేజీ ద్వారా రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, చారిత్రక, చేనేత వారసత్వాన్ని పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతంగా, సరసమైన ధరలోనే అందించడమే లక్ష్యంగా సంస్థ అడుగులు వేసింది.

ఈ ప్రత్యేక టూర్ సర్క్యూట్ "హైదరాబాద్ - యాదగిరిగుట్ట - శిల్పారామం - కొలనుపాక జైన దేవాలయం - స్వర్ణగిరి దేవాలయం - పోచంపల్లి - హైదరాబాద్" మార్గంలో సాగుతుంది. ఒకే రోజు ప్రయాణంలో అటు దైవదర్శనం, ఇటు చరిత్ర, కళలు, సాంప్రద...