భారతదేశం, నవంబర్ 25 -- తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

రెండు నియోజకవర్గాల పరిధిలో కలిపి మొత్తం 11,89,191 మంది పట్టభద్రులు ఓటు హక్కుకు అర్హత సాధించినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే డిసెంబరు 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం మొత్తం వచ్చిన దరఖాస్తులు 12,69,191, అర్హులైన ఓటర్లు 11,89,191, తిరస్కరించిన దరఖాస్తులు 80...