భారతదేశం, సెప్టెంబర్ 17 -- తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కీలక అప్డేట్ అందించింది. పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి రాత పరీక్షల తేదీలను బోర్డు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

సబ్ ఇన్స్‌పెక్టర్ (SI) పోస్టుల అభ్యర్థులకు నవంబర్ 29న రాత పరీక్ష నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డిసెంబర్ 20న పరీక్ష జరగనుంది.

రాష్ట్ర హోంశాఖ పరిధిలోని వివిధ కీలక విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నియామకాల ద్వారా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల్లో ఖాళీలను పూరించనున్నారు.

ఈ ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ...