భారతదేశం, జూన్ 11 -- తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (IPASE) పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. జనరల్, వొకేషనల్ కోర్సుల విద్యార్థుల మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది మే 13 నుంచి మే 21 వరకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, సకాలంలో ఫలితాలను బోర్డు ప్రకటించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల విడుదల నేపథ్యంలో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవే...