భారతదేశం, మే 23 -- Telangana Inter Supplementary Exams 2026 : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. బక్రీద్ పండుగ సెలవు దినాన్ని సవరించిన నేపథ్యంలో మే 28వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 28 (గురువారం) నాడు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (Environmental Education) పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీన బక్రీద్ రావటంతో.. మరుసటి రోజు అనగా మే 29, 2026 (శుక్రవారం) నాడు ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

మే 29వ తేదీన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది. కేవలం మే 28న జరగాల్సిన పరీక్షలో మాత్రమే మార్పు ఉంటుందని.. మిగిలిన పరీక్షల షెడ...