భారతదేశం, నవంబర్ 13 -- తెలంగాణ విద్యావ్యవస్థలో రాబోతున్న 10 ప్లస్ 2 విధానంపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. కొత్త విధానం అమల్లోకి వచ్చినా ఇంటర్ బోర్డును పూర్తిగా రద్దు చేసే ఆలోచన లేదని, అయితే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల పనితీరులో మాత్రం భారీ మార్పులు తప్పవని స్పష్టం చేశారు.

కొత్త విధానంలో ఇంటర్ బోర్డు ఉండదనే ప్రచారాన్ని ఆ అధికారి కొట్టిపారేశారు. పరీక్షలు నిర్వహించే విభాగాల పేరు మారవచ్చేమో కానీ, వాటి పనితీరు యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. 10వ తరగతి, 12వ తరగతి (ఇంటర్ సెకండియర్) బోర్డు పరీక్షలు నిర్వహించడానికి కచ్చితంగా ఒక వ్యవస్థ ఉండాల్సిందేనని పేర్కొన్నారు. దేశంలోని మరో 17 రాష్ట్రాల్లో ఇప్పటిక...