భారతదేశం, అక్టోబర్ 2 -- తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని ఆధునీకరించేందుకు, విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి(TGBIE) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్, మిగిలిన 80 శాతం మార్కులను థియరీ పరీక్షలకు కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

కేవలం వార్షిక రాత పరీక్షలలో సాధించే మార్కులపైనే కాకుండా, విద్యార్థి ఏడాదంతటా ప్రదర్శించే ప్రతిభ, క్రియాశీలత, సృజనాత్మకతలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఈ మార్పులను రూపొందించారు. విద్యార్థుల్లో అవగాహనా రాహిత్యాన్ని నివారించేందుకు, అప్లైడ్ లెర్నింగ్‌‌ను ప్రోత్సహించేందుకు ప్రధాన సబ్జెక్టులలో మార్పులు అమలులోకి వచ్చాయి.

ఆర్ట్స్, కామర్స్ అండ్ లాంగ్వేజెస్:హ్యూమానిటీస్ (పాలిటిక్స్, ...