భారతదేశం, ఆగస్టు 1 -- తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను వెల్లడించింది. జులై 29న ఈ ఖాళీల భర్తీకి సంబంధించి రిక్రూట్‌మెంట్ బోర్డు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అభ్యర్థులు కేవలం టీఎస్‌ఎల్‌పిఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఇతర ఏ మార్గాల్లో పంపిన దరఖాస్తులైనా తిరస్కరిస్తారు. దరఖాస్తుల ప్రారంభ తేదీ ఆగస్టు 19 (ఉదయం 8.00 గంటల నుండి), చివరి తేదీ సెప్టెంబర్ 9 (సాయంత్రం 5.00 గంటల వరకు) దాకా అప్లై చేసుకోవచ్చు.

ఈ నియామక ప్రక్రియలో నిర్దేశించిన వన్-టైమ్ ఫీజు అభ్యర్థన ప్రాసెసింగ్, ప్రిలిమినరీ రాత పరీ...