భారతదేశం, జూన్ 2 -- తెలంగాణలోని నిరుద్యోగ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 అసిస్టెంట్ ఇంజినీర్ (AE/AEE) స్థాయి పోస్టుల భర్తీ కోసం మూడు వేర్వేరు నియామక నోటిఫికేషన్లను విడుదల చేసింది. ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం వంటి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి. మొత్తం ఖాళీలు 290 ఉన్నాయి.

ఈ నియామక ప్రక్రియ ద్వారా రోడ్లు, భవనాల శాఖ (R&B)తో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్ట...