తెలంగాణలో సర్ ప్రారంభం.. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే
భారతదేశం, జూన్ 25 -- తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 25వ తేదీ నుంచే ఈ కీలక సర్వే అధికారికంగా ప్రారంభమైంది. జూలై 24వ తేదీ వరకు నెల రోజుల పాటు నిరంతరాయంగా సాగే ఈ ఓటర్ల వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఈ సర్వే కోసం జిల్లాల వారీగా ఉన్న ఓటర్ల వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ పత్రాలను యంత్రాంగం ఇప్పటికే ముద్రించింది. ప్రతి ఓటరు పేరు మీద రెండు కాపీలను సిద్ధం చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఓటర్లకు ఈ ఫారాలను ఇంగ్లిష్లో అందించనుండగా, మిగిలిన అన్ని జిల్లాల్లో తెలుగు భాషలో పంపిణీ చేయనున్నారు.
బూత్ లెవెల్ అధికారులు (BLO) ప్రతిరోజూ తమ పరిధిలోని కనీసం 50 ఇళ్లను సందర్శించి ఈ పత్రాలను ఓటర్లకు చేరవేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 3,38,26,448 మంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.