భారతదేశం, అక్టోబర్ 16 -- రాష్ట్రంలో రాగల ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 వరకు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.

ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 08:30 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....