తెలంగాణలో వర్షపాతం లోటు కారణంగా ఖరీఫ్ పంట నష్టం రూ. 20,000 కోట్లు!
భారతదేశం, అక్టోబర్ 12 -- తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ రంగానికి సుమారు రూ.20,000 కోట్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
వర్షపాతం తగ్గడం వల్ల సాగు విస్తీర్ణం పడిపోవడం, వర్షాల్లేక చేతికి వచ్చిన పంటలు ఎండిపోవడం, వేలాది ఎకరాల భూములు సాగుకు నోచుకోకపోవడం వల్ల ఈ స్థాయిలో నష్టం జరుగుతుందని వర్సిటీ నిపుణులు అంచనా వేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో పత్తి విస్తారంగా సాగయ్యే పంట కావడంతో ఖరీఫ్‌లో పత్తి రైతులకే అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
సాధారణంగా అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఈశాన్య రుతుపవనాలపై ఆధారపడే రబీ సీజన్ సాగు సాధారణంగా 1.3 కోట్ల ఎకరాల్లో జరుగుతుంది. అయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.