తెలంగాణలో రైతులకు ఐఎండీ ద్వారా పంచాయతీ లెవెల్ వాతావరణ సూచనలు : కేంద్రం
భారతదేశం, ఆగస్టు 7 -- తెలంగాణలో వరదలను ముందస్తుగా అంచనా వేసేందుకు అధునాతన న్యూమెరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడళ్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. వాతావరణ సమాచారం, వరద నిర్వహణపై రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వరద హెచ్చరికల వ్యవస్థలు, భూకంప గుర్తింపు కేంద్రాల విస్తరణ, రైతులకు అందించే వ్యవసాయ-వాతావరణ సూచనలపై ఎంపీ కోరిన సమాచారం మేరకు కేంద్ర మంత్రి వివరాలను వెల్లడించారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులు, కీలక ప్రాంతాలలో వరద ముందస్తు సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసే బాధ్యతను సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్వహిస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా భారత వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.