తెలంగాణలో రాగల 48 గంటలు భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఇలా!
భారతదేశం, జూలై 29 -- బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. రానున్న రెండు రోజుల పాటు (జులై 29, 30 తేదీలు) రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య, పశ్చిమ తెలంగాణ జిల్లాలలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.
పరిస్థితి తీవ్రతను బట్టి వాతావరణ శాఖ వివిధ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
మరికొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచనతో ఎల్లో అలర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.