భారతదేశం, మే 15 -- హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఆస్తి రిజిస్ట్రేషన్ రుసుములు భారీగా పెరిగే అవకాశం ఉంది. క్యూఆర్ పరిధిలోని ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సమయంలో ఈ వార్త కూడా వైరల్ అవుతోంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో భూముల ప్రభుత్వ మార్కెట్ విలువలను 15 శాతం నుండి 30 శాతం వరకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కొత్త ధరలు జూన్ నెల నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ మూడు జిల్లాల్లో ప్రతి నెలా సుమారు 40,000 నుండి 50,000 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ధరలు 15 శాతం పెరిగితే కొనుగోలుదారులపై నెలకు రూ.150 కోట్ల నుండి రూ.180 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే 30 శాతం పెరిగితే, ఈ భారం నెలకు ఏకంగా రూ.300 కోట్ల నుండి రూ.360 కోట్లకు చేరుకుంటుంది.

ఐటీ...