భారతదేశం, నవంబర్ 9 -- గత నాలుగైదు రోజులుగా తెలంగాణలోని వాతావరణంలో చలి పెరిగింది. ప్రజలు ఉదయంపూట బయటకు వెళ్లాలంటే వణుకుతున్నారు. ఇక దుప్పట్లను బయటకు తీస్తున్నారు. ఆదివారం నుండి సోమవారం(నవంబర్ 9, 2026) ఉదయం 8:30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం, వివిధ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తాజా వాతావరణ నివేదిక ప్రకారం, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీలు, అలాగే నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని ఉప్పల్ (మౌలాలీ) ప్రాంతంలో 15 డిగ్రీలు, హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ...