భారతదేశం, అక్టోబర్ 19 -- పండుగల వేళ తెలంగాణవ్యాప్తంగా ప్రజలకు కూరగాయల మంట తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యావసరలు, కూరగాయల ధరలు పెరగడంతో గృహ బడ్జెట్‌లు పూర్తిగా తలకిందులవుతున్నాయి. ధరల ఘాటుకి తట్టుకోలేక వినియోగదారులు కొనుగోళ్లను బాగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత కొద్ది వారాలుగా మార్కెట్‌లో అత్యంత కీలకమైన టమోటా, ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని వీధి మార్కెట్లలో కిలో రూపాయిలు 20కి లభించిన టమోటా ధర ఇప్పుడు రూ. 50కి చేరింది. సూపర్ మార్కెట్లలో అయితే కిలో రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. వీధి మార్కెట్లలో దాదాపు 150 శాతం, సూపర్ మార్కెట్లలో 71 శాతం మేర ధర పెరిగింది. తీవ్రమైన ఎండలు, నీటి కొరత, పంట నష్టం, మార్కెట్‌కు దిగుబడులు తగ్గడమే దీనికి ప్రధాన కారణం.

సెప్టెంబర్ నెల ప్రారంభంలో కిలో రూ. 30గా ఉన్న ఉల్ల...