భారతదేశం, అక్టోబర్ 22 -- తెలంగాణలో భూగర్భ జలాలు ఊహించని రీతిలో అడుగంటిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాది అక్టోబర్ నాటితో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నగర పరిధిలోని ప్రధాన కార్పొరేషన్లలో నీటి మట్టాలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాల సగటు లోతు 4.73 మీటర్లు ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అది ఏకంగా 11.58 మీటర్లకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాది వ్యవధిలోనే సగటున 6.85 మీటర్ల మేర భూగర్భ జలాలు క్రమంగా క్షీణించాయి.

ఎల్ నినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు, నీటి వాడకం విపరీతంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని భూగర్భ జల వనరుల శాఖ సమర్పించిన నివేదిక స్పష్టం చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 46 మండలాల్లో భూగర్భ జల శాఖ నిర్వహించిన సర్వే ఆధారంగా అత్...