భారతదేశం, మార్చి 27 -- తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజా వాతావరణ సూచన ప్రకారం తెలంగాణలో తీవ్రమైన వేడి వాతావరణం నెలకొననుంది. ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40-41 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, వీటితో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరాఠ్వాడా నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉన్న ఒక ద్రోణి వాతావరణంపై ప్రభావం చూపుతోంది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మొదట్లో సాధారణ స్థాయికి దగ్గరగానే ఉంటాయని, ఆ తర్వాతి నాలుగు రోజుల్లో మాత్రం సాధారణం కంటే 2-3 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ నగరం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.