భారతదేశం, ఏప్రిల్ 18 -- తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమైంది. గత కొంతకాలంగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మండల, జిల్లా పరిషత్‌లకు తిరిగి ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా తయారీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

కొత్త ఓటర్ల చేరిక: 10.07.2025 నుండి 05.02.2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితా ఆధారంగా అదనపు ఓటర్లను గుర్తించనున్నారు.

గడువు: ఓటర్ల డేటాలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోపు నివేదించాలని హైదరాబాద్, మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

తుది జాబితా: ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరి...