భారతదేశం, మే 13 -- మెగా గ్రోత్ కారిడార్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఆర్థిక, పర్యాటక రంగాలు పుంజుకునేలా ఈ ప్రణాళికలు ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు (ORR) నిర్మించాలని వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల నిర్మాణం జరపాలన్నారు.

సింగరేణి సంస్థకు చెందిన సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నల్గొండ - యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ నిర్మించాలన్నారు. అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీ...