భారతదేశం, నవంబర్ 14 -- తెలంగాణలో నెలకొన్న తీవ్ర వర్షాభావ, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ సాయం కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. నవంబర్ 15న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో వీరు భేటీ కానున్నారు. ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావం, తద్వారా వ్యవసాయ రంగం, రైతులు, గ్రామీణ జీవనోపాధిపై పడిన తీవ్ర ప్రభావాన్ని ప్రధానికి నేరుగా వివరించనున్నారు.

కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు, రైతుల కష్టాలను తీర్చేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. కరువు నివారణ చర్యలను బలోపేతం చేసేందుకు.. అన్నదాతలకు సకాలంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం సహ...