భారతదేశం, మే 23 -- Telangana Heat Wave Alert : తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రంలో ఉక్కపోత, తీవ్ర వడగాల్పులు (హీట్ వేవ్) ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి.

ఈ భయంకరమైన వడగాల్పుల కారణంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఇప్పటివరకు 16 మంది మృత్యువాత పడ్డారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడగాల్పులపై తీవ్ర అప్రమత్తత ప్రకటించింది. ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.

రాష్ట్రంలో నెలకొన్న ఈ తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ పరిస్థితులపై శనివారం నాడు సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర...