భారతదేశం, ఆగస్టు 30 -- తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజంను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు రెండు కొత్త అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ కోర్సులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ రెండు ప్రతిష్టాత్మక గోల్ఫ్ కోర్సులను వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

షామీర్‌పేట్ సమీపంలోని జవహర్‌నగర్‌లో ఉన్న సుమారు 130 ఎకరాల విస్తీర్ణంలో మొదటి గోల్ఫ్ కోర్సును నిర్మించాలని చూస్తోంది ప్రభుత్వం. రాజధాని హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం...